మహా కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం..! 23 h ago
ఏపీ: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రధం బయల్దేరింది. బుధవారం ఉదయం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేసి పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా బీఆర్ నాయిడు మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చెయ్యగా 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనితో జనవరి 18, 26, ఫిబ్రవరి 3,12 తేదీలలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరపాలని నిర్ణయించారు.